మలాయ్‌ గులాబ్‌ జూమూన్‌




మలాయ్‌ గులాబ్‌ జూమూన్‌



కావల్సిన పదార్థాలు:
క్రీమ పౌడర్‌ మిల్క్‌: 1 కప్పు
సూజి: 4 కప్పు,మైదా: 4 కప్పులు
పాలు: 1(పిండి తయారుచేయడానికి)
బేకింగ్‌ పౌడర్‌
వేయించడానికి నెయ్యి
ఫిల్లింగ్‌ (నింపడం) కోసం:
క్రీమ్‌/మలై: 1
కొబ్బరి తురుము, పందార సిరప్‌ కోసం
చక్కెర: 2 కప్పులు,నీళ్ళు: 2 కప్పులు



తయారుచేయు విధానం:

1. ముందుగా మైదాపిండి, సూజి(రవ్వ), పాలపొడి, పాలు, బేకింగ్‌ పౌడర్‌ మరియు నెయ్యి అన్నింటిని ఒక బౌల్లోకి వేసి మెత్తగా, మృదువుగా చపాతీ పిండిలా కలిపి 2నుండి 3 గంటలపాటు పక్కన పెట్టుకోవాలి.
3. మూడు గంటల తర్వాత తిరిగి కొద్దిగా పాలు పోసి మళ్ళీ సాఫ్ట్‌ గా కలిపి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి స్టిఫ్‌గా తయారవుతుంది.
4. ఇప్పుడు స్టౌ మీద ఫ్రైయింగ్‌ పాన్‌ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. మీడియం మంట పెట్టి నూనె కాగనివ్వాలి.
5. అంతలోగా ముందుగా కలిపి పెట్టుకొన్న పిండి నుండి కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఒక ప్లేట్‌ లో పెట్టుకోవాలి. చిన్న ఉండలు చుట్టే ముందు, చేతికి నెయ్యి రాసుకోవడం వల్ల తేలికగా సాప్ట్‌గా జామూన్‌ బాల్స్‌ తయారవుతాయి.
6. ఇప్పుడు గ్యాస్‌ మరో బర్నల్‌ మీద ఫ్రయింగ్‌ పాన్‌ పెట్టి, నెయ్యి వేసి, వేడయ్యాక అందులో జామూన్‌ బాల్స్‌ వేసి, బ్రౌన్‌ కలర్‌ వచ్చేవరకూ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్‌ కలర్‌ లోకి మారగానే వాటిని తీసి, షుగర్‌ సిరఫ్‌లో వేసి, పదినిముషాలు నాననివ్వాలి. తర్వాత ఒక్కో గులాబ్‌ జామ్‌కి చిన్న గాటుటా పెట్టి లోపల మలైను నింపాలి, తర్వాతా గులాబ్‌ జామూన్ల మీద తాజా కొబ్బరి తురుమును చిలకరించి సర్వ్‌ చేయాలి.