చూర్మా లడ్డు



చూర్మా లడ్డు
కావలసినవి:

కోవా - 100 గ్రాములు,గోధుమ పిండి - 200 గ్రాములు,బాదాం పప్పు - 50 గ్రాములు,యాలకులు - 4, నెయ్యి - 400 గ్రాములు,పంచదార పొడి - 200 గ్రాములు





తయారీ విధానం : గోధుమ పిండి తీసుకుని కరిగించిన నెయ్యి కొద్దిగా నీళ్లు చపాతీ పిండిలా కలుపుకుని ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని స్టవ్‌ వెలిగించి పాన్‌ పెట్టి నెయ్యి వేసి తడిపిన ఈ ఉండలను వేసి బ్రౌన్‌ కలర్‌ వరకు వేయించుకుని చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడి ఒక గిన్నెలోకి తీసుకుని కోవా వేసి కలపాలి. తరువాత పంచదార, బాదాం యా లకులు కలిపి పొడి పెట్టుకోవాలి. పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి గోధుమపిండి, కోవా మి శ్రమం వేసి కొంచంసేపు వేయించి, చల్లారాక. బాదాం మిస్రమాన్నీ వేసి కలిపి లడ్డులు చేసుకోవాలి.