ఆహారం తాజాగా ఉండాలంటే...?



ఆహారం తాజాగా ఉండాలంటే...?
ఆహారాన్ని ఎక్కువ మొత్తంలో వండకూడదు. ఏడాదిలో వర్షాకాలం సమయంలో ఆహారం చాలా సులభంగా ఫంగస్‌కు ప్రభావితమవుతుంది. అంతేకాకుండా నగర వాతావరణంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వలన ఆహారం తొందరగా చెడిపోతుంది. దీనికి ఉత్తమ మార్గం ఏమిటంటే మనకు సరిపడే పరిమాణంలో మాత్రమే ఆహారాన్ని వండుకోవాలి. ఒకవేళ మిగిలిపోతే ఇంటిలో పనిచేసేవారికి పెట్టాలి.

ఫ్రిజ్‌లో పొడి వస్తువులే: 
రిఫ్రజిరేటర్లో పొడి పదార్దాలను పెట్టండి రవ్వ,మైదా వంటి పొడి పదార్దాలను ఫ్రిడ్‌‌జ లో పెట్టాలి. అలాగే వర్షాకాలంలో రవ్వను కొంచెం వేగించి ఫ్రిడ్‌‌జ లో పెట్టుకుంటే అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. శనగపిండిని కూడా బాగా జల్లించి గాలి చొరని డబ్బాలలో పోసి ఫ్రిడ్‌‌జలో నిల్వ ఉంచాలి. ఈ విధంగా చేయుట వలన ఫంగస్‌ను నివారించవచ్చు.

సహజ ఉత్ప్రేరకాలు: 
ఉత్ప్రేరకాలను ఉపయోగించాలి వర్షాకాలంలో కీటకాలు లేదా పురుగులు నుండి కాయధాన్యాలను సేవ్‌ చేసేందుకు,వాటిని నిల్వ చేసే ముందు ఆవ నూనెను రాయాలి. తాజా ఆహార ధాన్యాలను నిల్వ ఉంచే క్రమంలో వాటికీ కొంత ఆముదదాన్ని చల్లాలి. అయితే ఆముదం ఎక్కువగా కాకుండా ఒక నిర్దిష్ట మొత్తంలో తీసుకోని చూడటానికి ప్రకాశవంతముగా ఉండేలాగా మాత్రమే జాగ్రత్తగా రాయాలి. నట్‌‌స తేమ కారణంగా మెత్తగా మారతాయి. వాటిని మెక్రోవేవ్‌లో వేడి చేస్తే,అవి కొన్ని నిమిషాల తర్వాత క్రిస్పి గా మారతాయి. 

బాక్టీరియాకు దూరంగా: 
వండిన ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలి వండిన ఆహారంలో బాక్టీరియా చేరకుండా ఉండటానికి,రెండు గంటలకు ఒకసారి మూత తీసి వండిన ఆహారంను కలుపుతూ ఉండాలి. చపాతీలు నాచు పట్టకుండా ఉండటానికి వార్తాపత్రికలు లేదా సిల్వర్‌ ఫాయిల్‌ పేపర్‌తో చుట్టాలి. ఈ సీజన్‌లో ఆహారం చెడిపోతుంది. కాబట్టి ఆహారం నిల్వ ఉంచినప్పుడు తప్పనిసరిగా కవర్‌ చేయాలి. అప్పడాలు వేగించిన తర్వాత,ఎక్కువసేపు క్రిస్పిగా ఉండాలంటే వాటిని ఒక జిప్‌ లాక్‌ ప్యాకెట్లలో నిల్వ చేయాలి. ఎల్లప్పుడూ మీ ఆహారాలను వండటానికి ముందు,తర్వాత కవర్‌ చేయాలి. లేకపోతే మీ ఆహారానికి మరియు ఆరోగ్యానికి ఒక పెద్ద ముప్పు ఉంటుంది. వాష్‌ మరియు డ్రై కూరగాయలు మరియు పండ్లను శుభ్రంగా కడగాలి. వీటిని ఉపయోగించడానికి ముందు మరియు ఫ్రిడ్‌‌జలో పెట్టటానికి ముందు బాగా ఆరనివ్వాలి.

ఫ్రిజ్‌ ఉంది కదా అని: 
కొంత మంది ఇళ్లలో ఫ్రిజ్‌ ఉందికదా అని పట్టకుండా నింపేస్తుంటారు. అలా చేసినప్పుడు కొద్ది రోజులకే పాడవుతుంటాయి. మరికొన్ని పండినట్లు అనిపిస్తుంటాయి. ఎందుకలా జరిగిందో అర్ధంకాక సతమతమవుతుంటారు. అలాంటి వారు చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే ఫ్రిజ్‌లో పళ్ళు, కూరగాయలు నిల్వ చేసుకొనేటప్పుడు కూడా తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

ధరల మోత:
అసలే కూరగాయలు, పళ్ళు మొదలైన వాటి ధరాలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో వాటిని జాగ్రత్తగా నిల్వచేయాలి. ఇలా చేయడం వల్ల కేవలం డబ్బు ఆదా అవ్వడం మాత్రమే కాదు, వాటిలోని పోషక విలువలు కూడా అలాగే నిలిచి ఉంటాయి. అందుకే ఈ క్రింది అంశాలు గుర్తుంచుకోవాలి. ఫ్రిజ్‌ లో స్థలం సరిపోవడం లేదా..? అందుకు సులభ చిట్కాలు

1. మార్కెట్‌ నుంచి కూరగాయలు, పళ్ళు...తెచ్చిన వెంటనే అన్నీ కలిపి ఫ్రిజ్‌ లో ఒకే చోట భద్రపరచకూడదు. వేటికవి విడదీసి, విడివిడిగా, రంధల్రున్న కవర్‌‌స లో పెట్టుకోవాలి. దీని వల్ల గాలి సర్కు్యలేట్‌ అవుతుంది. ఫలితంగా అవి ఎక్కువ సమయం తాజాగా కూడా ఉంటాయి. 
2. బంగాళదుంప, ఉల్లిపాయలు, టమోటో, వెల్లుల్లి, అరటిపళ్ళు మొదలైనవి ఫ్రిజ్‌ లో పెట్టకూడదు. 
3. అలాగే బంగాళదుంపలు, మష్రూమ్‌‌స...మొదలైనటువంటి వాటిని ఉపయోగించే ముందు వరకు కడగకూడదు. అప్పుడే అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. 
4. ఉల్లి వెల్లుల్లి, మొదలైనవి ఫ్రిజ్‌ లో కన్నా బయటే గాలి, వెలుతురు ధారళంగా వచ్చే ప్రాంతంలో ఉంచితేనే ఎక్కువ కాలం తాజగా ఉంటాయి. 
5. ఆకు కూరలు తెచ్చిన వెంటనే వాటికున్న బ్యాండ్లు, తాళ్ళు తీసేయాలి. తర్వాత చల్లని నీటితో వాటిని కడిగి పాడైపోయినవి, కుళ్లిన కాడలేమైనా ఉంటే తీసేయాలి. వేటికవి విడదీసి విడివిడిగా కవర్లలో పెట్టి భద్రపరచుకోవాలి. 
6. ఫ్రిజ్‌ లో భద్రపరిచే ఆకుకూరలు కాస్త వాడిపోయినట్లుగా కనిపిస్తాయి. అలా కాకుండా ఉండాలంటే, ఆకుకూరల కాడలను ట్రిమ్‌ చేసుకోవాలి. అలాగే కట్‌ చేసిన చివర్లను ఒక చిన్న పాత్రలో నీటిలో ఉంచుతూ పై భాగాన్ని కవర్‌ తో కప్పి ఉంచాలి. అంటే ఫ్లవర్‌ వాజ్‌ లా అన్న మాట. ఇలా చేయడం వల్ల అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

వాసన రాకుండా: 
టమోటోల విషయానికొస్తే అవి బటయ ఉన్నా కూడా గది ఉష్ణోగ్రత వద్ద బాగానే నిల్వఉంటాయి. వాసన, రుచి సహజంగా నిలిచి ఉంటాయి. ఫ్రిజ్‌ లో ఉన్న టమోటాలైతే కాస్త రుచి తగ్గుతాయనే చెప్పవచ్చు.