This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

వెజ్ నూడల్ ఫ్రైడ్ రైస్



వెజ్ నూడల్ ఫ్రైడ్ రైస్


కావలసినవి: 

కారట్ - పావు కప్పు
కాబేజీ - పావు కప్పు
కాప్సికం - పావు కప్పు
బేబి కార్న్ - పావు కప్పు
ఉల్లి కాడలు - కట్ చేసినవి - ఒక పావు కప్పు
అల్లం వెల్లుల్లి ముద్ద - 2స్పూన్లు
సోయా సాస్ - రెండు స్పూన్లు
రెడ్ చిల్లి సాస్ - రెండు స్పూన్లు
చిల్లి వెనిగర్ - ఒక స్పూన్

మొదట ఒక గ్లాస్ బియ్యం ఒక స్పూన్ నుని వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోండి, అలాగే ఒక కప్పు నూడిల్స్ కుడా నునే వేసుకొని ఉడికించుకొని మళ్లీ కాస్త ఒకటి రెండు స్పూన్ల నూని వేసుకొని పక్కన పెట్టుకోండి .
ఒక ముకుడిలో నునే వేసుకొని అందులో ఈ ముక్కలు అన్ని వేసుకొని సగం వేగాక అందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని తరవాత సోయాసాస్, చిల్లి సాస్, వెనిగర్ వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని అందులో అన్నం, నూడిల్స్ వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే వేడిగా ఒక ప్లేట్ లో వేసుకొని తింటే.. చాలా బాగుంటుంది. ట్రై చేసి చేసి చూడండి.

బొబ్బర్ల దోసలు



బొబ్బర్ల దోసలు



కావాల్సినవి : 

బొబ్బర్లు : 1 కప్పు
శెనగపప్పు : 1/2 కప్పు
బియ్యం పిండి : 4 స్పూన్
పచ్చి మిర్చి : 5
అల్లం : ఒక 2 ఇంచులు
కొత్తిమీరి : 1/4 కట్ట
ఉప్పు తగినంత

ఒక రాత్రి బొబ్బర్లు నానపెట్టుకొని అందులోనే శెనగ పప్పు కూడా నానపెట్టుకొని , అల్లం పచ్చిమిర్చి, కొత్తిమీరి, ఉప్పు వేసుకొని , మెత్తగా రుబ్బుకొని ఉంచుకోవాలి. ఇంకో అరగంటలో దోసలు వేసుకుంటాము అనుకున్నప్పుడు బియ్యపుపిండి కలుపుకోవాలి.

దోసలా వెసుకొని పైన ఉల్లి చెక్కు వేసుకొని , కాస్త మిర్చి, అల్లం ముక్కలు కూడా వేసుకొని చేస్తే బాగుంటాయి. కొద్దిగా కంద అట్లలా ఉంటాయి.

కోకోనట్ ఫ్రైడ్‌రైస్




కోకోనట్ ఫ్రైడ్‌రైస్



కావలసినవి :

అన్నం- 3 కప్పులు 
కొబ్బరి తురుము - 1 కప్పు 
ఉల్లిపాయ -1 
కరివేపాకు - 2 రెమ్మలు 
పసుపు - చిటికెడు 
ఉప్పు - తగినంత 
నూనె - 4 టీ.స్పూ. 
ఆవాలు, జీలకర్ర - 1/4 టీ స్పూన్లు 

పొడి చేయడానికి : 

ఎండుమిర్చి - 4 
జీలకర్ర - 1/2 టీ స్పూన్లు 
ధనియాలు - 2 టీ స్పూన్లు 
మిరియాలు - 1/2 టీ స్పూన్లు 
నువ్వులు - 2 టీ స్పూన్లు 

అన్నం పొడి పొడిగా వండి పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి తురుముకోవాలి. బాణలి వేడి చేసి చెంచాడు నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, నువ్వులు వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి. అదే పాన్‌లో మిగిలిన నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు వేసి కలిపి కొబ్బరి తురుము వేయాలి. కొబ్బరి తడి పోయేవరకు వేయించి తయారుచేసుకున్న మసాలాపొడి రెండు నిమిషాలు వేపి అన్నం, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. మరో రెండు నిమిషాలు వేయించి వేడిగా సర్వ్ చేయాలి. ఘాటైన కొబ్బరి అన్నం రెడీ.


పాల పూరీలు




పాల పూరీలు


కావలసిన పదార్థాలు :
మైదా - 200గ్రా
గోధుమపిండి - 200గ్రా
పాలు - అర లీటరు
ఉప్పు - అరచెంచా
గసగసాలు - 25గ్రా
నూనె- సరిపడా
పంచదార - 200గ్రా
కొబ్బరి పాలు - అర లీటరు
యాలకుల పొడి - కొద్దిగా



తయారీ విధానం :

ముందుగా పాలు బాగా కాచి అందులో పంచదార, కొబ్బరిపాలు, యాలకుల పొడి, గసగసాల పొడి వేసి బాగా కలిపి పక్క పెట్టుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకోవాలి.మెదా, గోధుమపిండి, ఉప్పు, నీళ్లు వేసి పూరీ పిండిలా కలిపి పక్కన వేసి కలిపి పదిహేను నిముషాలు పక్కన పెట్టుకోవాలి. పిండితో పూరీలు చేసి పెట్టుకుని ఆయిల్‌ మరిగించి పూరీలు బ్రౌన్‌గా వేయించి తయారు చేసుకున్న పాల మిశ్రమంలో వేసుకుని అవి నానాక సర్వ్‌ చేసుకోవాలి.

కోవా కజ్జికాయ



కోవా కజ్జికాయ


కావలసిన పదార్థాలు

మైదాపిండి అరకిలో, పంచదార కిలో, పాలకోవా - పావుకిలో, జాపత్రి - 2 గ్రాములు, 
యాలకులు 2 గ్రాములు, శనగపిండి 50 గ్రాములు, వంట సోడా - పావు స్పూను, బేకింగ్‌ పౌడర్‌ పావుస్పూను, నెయ్యి 100 గ్రాములు, రిఫైన్డ్‌ ఆయిల్‌ - తగినంత



తయారు చేసే పద్ధతి: 


ఇండియన్‌ స్వీట్లలో కజ్జికాయ విశిష్టమైంది. కజ్జికాయ ఇష్టపడనివారు దాదాపుగా ఉండరు. కజ్జికాయ అనేక వెరైటీల్లో కోవా కజ్జికాయ రెసిపీ ఒకటి. రుచికరమైన కోవా కజ్జికాయ రెసిపీ తెలుసుకుందాం. ముందుగా శనగపిండిలో కోవా కలిపి కొంచెం వేయించి దించాలి. దానిలో జాపత్రిపొడి, యాలకులపొడి, కొంచెం పంచదార కలిపి ముద్దగా చేయాలి. 

బాణలిలో మిగిలిన పంచదార పోసి, 2 గ్లాసులు నీళ్ళు పోసి లేత పాకం వచ్చేవరకూ ఉంచి దించాలి. మైదాపిండిలో వంట సోడా, బేకింగ్‌ పౌడర్‌ కలిపి జల్లించాలి.అందులో కరగబెట్టిన నెయ్యి కలిపి నీళ్ళు చేర్చి గట్టి ముద్దలా చేయాలి. నిమ్మకాయంత ముద్దలను తీసుకుని పూరీలా, కొంచెం మందంగా ఒత్తి మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి అర్ధచంద్రాకారంలో మూసి, అంచులను తడిచేసి, కోవాకు దగ్గరగా చుట్టి కజ్జికాయలు చేయాలి. వీటిని నూనెలో వేయించి కొంచెం రంగు రాగానే తీసి, పంచదార పాకంలో వేసి ముంచి తీస్తే సరి, నోరూరించే కోవా కజ్జికాయలు సిద్దం!



మలాయ్‌ గులాబ్‌ జూమూన్‌




మలాయ్‌ గులాబ్‌ జూమూన్‌



కావల్సిన పదార్థాలు:
క్రీమ పౌడర్‌ మిల్క్‌: 1 కప్పు
సూజి: 4 కప్పు,మైదా: 4 కప్పులు
పాలు: 1(పిండి తయారుచేయడానికి)
బేకింగ్‌ పౌడర్‌
వేయించడానికి నెయ్యి
ఫిల్లింగ్‌ (నింపడం) కోసం:
క్రీమ్‌/మలై: 1
కొబ్బరి తురుము, పందార సిరప్‌ కోసం
చక్కెర: 2 కప్పులు,నీళ్ళు: 2 కప్పులు



తయారుచేయు విధానం:

1. ముందుగా మైదాపిండి, సూజి(రవ్వ), పాలపొడి, పాలు, బేకింగ్‌ పౌడర్‌ మరియు నెయ్యి అన్నింటిని ఒక బౌల్లోకి వేసి మెత్తగా, మృదువుగా చపాతీ పిండిలా కలిపి 2నుండి 3 గంటలపాటు పక్కన పెట్టుకోవాలి.
3. మూడు గంటల తర్వాత తిరిగి కొద్దిగా పాలు పోసి మళ్ళీ సాఫ్ట్‌ గా కలిపి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి స్టిఫ్‌గా తయారవుతుంది.
4. ఇప్పుడు స్టౌ మీద ఫ్రైయింగ్‌ పాన్‌ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. మీడియం మంట పెట్టి నూనె కాగనివ్వాలి.
5. అంతలోగా ముందుగా కలిపి పెట్టుకొన్న పిండి నుండి కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఒక ప్లేట్‌ లో పెట్టుకోవాలి. చిన్న ఉండలు చుట్టే ముందు, చేతికి నెయ్యి రాసుకోవడం వల్ల తేలికగా సాప్ట్‌గా జామూన్‌ బాల్స్‌ తయారవుతాయి.
6. ఇప్పుడు గ్యాస్‌ మరో బర్నల్‌ మీద ఫ్రయింగ్‌ పాన్‌ పెట్టి, నెయ్యి వేసి, వేడయ్యాక అందులో జామూన్‌ బాల్స్‌ వేసి, బ్రౌన్‌ కలర్‌ వచ్చేవరకూ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్‌ కలర్‌ లోకి మారగానే వాటిని తీసి, షుగర్‌ సిరఫ్‌లో వేసి, పదినిముషాలు నాననివ్వాలి. తర్వాత ఒక్కో గులాబ్‌ జామ్‌కి చిన్న గాటుటా పెట్టి లోపల మలైను నింపాలి, తర్వాతా గులాబ్‌ జామూన్ల మీద తాజా కొబ్బరి తురుమును చిలకరించి సర్వ్‌ చేయాలి.

కర్బూజా రసగుల్ల



కర్బూజా రసగుల్ల


కావలసినవి:


కర్బూజా పండు - అరకేజి
పాలు - ఒక లీటర్‌
నెయ్యి -100 గ్రా
పంచదార - 2 కప్పులు
కార్న్‌ ఫోర్‌- 3 స్పూన్లు
నిమ్మకాయ -1






తయారు చేసే విధానం: 


ముందుగా చక్కెరతో తీగ పాకం పట్టాలి తరువాత కర్బూజాని ముక్కలుగా చేసి మిక్సిలో వేసి జ్యూస్‌ చేసుకొని పాకము చల్లారాక జ్యూస్‌ ను అందులో కలపాలి. తరువాత పాలను మరిగించి అందులో నిమ్మకాయ పిండి పాలు విరిగేలా చెయ్యాలి.తరువాత అందులో నీరంతా పోయేలా పల్చటి గుడ్డలో వేసి వడకట్టి పన్నీర్‌ తయారు చేసుకోవాలి.ఇప్పుడు విరిగిన పాల మిశ్రమంలో కార్న్‌ ఫోర్‌ వేసి బాగా కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత గిన్నెలో నెయ్యి పోసి కాగాక ఉండలను వేసి బ్రౌన్‌ కలర్‌ వచ్చే వరకు వేయించి ముందుగా తయారుచేసుకున్న కర్బూజా జ్యూస్‌లో వేసి నానవ్వాలి.లేదా ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా కూడా సర్వ్‌ చేసుకోవచ్చు...




బాదుషా




బాదుషా 


దీపావళి పండుగకు తయారు చేసే స్వీట్లలో బాద్‌షా ఒకటి. అలాంటి బాద్‌షాను ఎలా తయారు చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం. బాద్‌షా తయారీకి కావాల్సిన పదార్థాలను పరిశీలిస్తే...
మైదా : అరకేజీ
డాల్డా : 200 గ్రాములు, తినే సోడా : అర టీ స్పూన్‌, రిఫైండ్‌ఆయిల్‌ : తయారీకి సరిపడినంత, చక్కెర : ఒక కేజీ
యాలుకల పొడి : ఒక టీ స్పూన్‌
నెయ్యి : పది గ్రాములు
నీరు : అర లీటరు


తయారు చేసే విధానం: 

ఒక పాత్రలో మైదా, సోడా, డాల్డాలకు తగినన్ని నీళ్లు కలిపి బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ఆ ముద్దను చిన్న చిన్న ఉండలు చేయాలి. ఒక్కో ఉండ తీసుకుని దాన్ని గుండ్రంగా చేసి మధ్యలోకి చిన్నపాటి గుంట ఉండేలా నొక్కి సిద్ధంగా చేసి పెట్టుకోవాలి. ఒక బాండీలోని నూనెను దోరగా వేయించి పెట్టుకోవాలి. పంచదార, నీళ్ల మిశ్రమాన్ని తీసుకుని సన్నని సెగపై తీగ పాకం వచ్చేవరకు మరిగించి, ఆపై యాలుకల పొడి, నెయ్యి వేసి కలిపి, వేయించి పెట్టుకున్న బాద్‌షాలు వేయాలి. పాకంలో 10 నిమిషాల పాటు నానబెట్టి తీసేయాలి. 



చూర్మా లడ్డు



చూర్మా లడ్డు
కావలసినవి:

కోవా - 100 గ్రాములు,గోధుమ పిండి - 200 గ్రాములు,బాదాం పప్పు - 50 గ్రాములు,యాలకులు - 4, నెయ్యి - 400 గ్రాములు,పంచదార పొడి - 200 గ్రాములు





తయారీ విధానం : గోధుమ పిండి తీసుకుని కరిగించిన నెయ్యి కొద్దిగా నీళ్లు చపాతీ పిండిలా కలుపుకుని ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని స్టవ్‌ వెలిగించి పాన్‌ పెట్టి నెయ్యి వేసి తడిపిన ఈ ఉండలను వేసి బ్రౌన్‌ కలర్‌ వరకు వేయించుకుని చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడి ఒక గిన్నెలోకి తీసుకుని కోవా వేసి కలపాలి. తరువాత పంచదార, బాదాం యా లకులు కలిపి పొడి పెట్టుకోవాలి. పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి గోధుమపిండి, కోవా మి శ్రమం వేసి కొంచంసేపు వేయించి, చల్లారాక. బాదాం మిస్రమాన్నీ వేసి కలిపి లడ్డులు చేసుకోవాలి.

రాజ్‌భోగ్‌ స్వీట్‌



రాజ్‌భోగ్‌ స్వీట్‌
కావల్సిన పదార్థాలు:

విరిగిన పాలు - 250 గ్రా. (ఆవు పాల నుంచి చేసినది),పచ్చికోవా - 3 టేబుల్‌ స్పూన్లు,పిస్తాపప్పులు - 15
మైదా - టీ స్పూను, పంచదార - 5 కప్పులు
కుంకుమపువ్వు - అర టీ స్పూను
రోజ్‌ సిరప్‌ - 2 టేబుల్‌ స్పూన్లు
ఏలకుల పొడి - అర టీ స్పూను


తయారుచేయు విధానం:
1. ముందుగా విరిగిన పాలను మెత్తగా మెదిపి, దానికి మైదా జత చేయాలి. దానిని బాగా కలిపి, చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి.
2. తర్వాత వేడినీటిలో పిస్తా పప్పులను వేసి ఐదు నిముషాలు ఉంచి, నీటిని వడగట్టి, పైన తొక్కలు తీసి, సన్నగా కట్‌ చేసుకోవాలి.
3. ఇప్పుడు పచ్చికోవా పొడి, పిస్తా తరుగు, బాదం పప్పులను ఒక గిన్నెలో వేసి కలిపి, చిన్నచిన్న ఉండలుగా చేయాలి.
4. తర్వాత పాలవిరుగుతో చేసిన ఒక్కో ఉండలో పిస్తా, బాదం మిశ్రమాన్ని స్టఫ్‌ చేసి పక్కన ఉంచాలి.
5. ఒక పాత్రలో పంచదార, నీరు పోసి స్టౌ మీద ఉంచి మరిగించి, వెడల్పాటి పాత్రలో పోసి, కుంకుమపువ్వు రేకలు వేయాలి
6. తయారుచేసి ఉంచుకున్న స్టఫ్‌డ్‌ బాల్స్‌ని ఇందులో వేసి స్టౌ మీద ఉంచి, ఐదు నిముషాలు ఉడికించాలి.
7. అరకప్పు వేడినీరు పోసి, మరో ఐదుని ముషాలు ఉంచితే, బాల్స్‌ రెట్టింపు సైజుకి పొం గుతాయి. అంతే రాజ్‌ భోగ్‌ స్వీట్‌ రిసిపి రెడీ.



ఆహారం తాజాగా ఉండాలంటే...?



ఆహారం తాజాగా ఉండాలంటే...?
ఆహారాన్ని ఎక్కువ మొత్తంలో వండకూడదు. ఏడాదిలో వర్షాకాలం సమయంలో ఆహారం చాలా సులభంగా ఫంగస్‌కు ప్రభావితమవుతుంది. అంతేకాకుండా నగర వాతావరణంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వలన ఆహారం తొందరగా చెడిపోతుంది. దీనికి ఉత్తమ మార్గం ఏమిటంటే మనకు సరిపడే పరిమాణంలో మాత్రమే ఆహారాన్ని వండుకోవాలి. ఒకవేళ మిగిలిపోతే ఇంటిలో పనిచేసేవారికి పెట్టాలి.

ఫ్రిజ్‌లో పొడి వస్తువులే: 
రిఫ్రజిరేటర్లో పొడి పదార్దాలను పెట్టండి రవ్వ,మైదా వంటి పొడి పదార్దాలను ఫ్రిడ్‌‌జ లో పెట్టాలి. అలాగే వర్షాకాలంలో రవ్వను కొంచెం వేగించి ఫ్రిడ్‌‌జ లో పెట్టుకుంటే అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. శనగపిండిని కూడా బాగా జల్లించి గాలి చొరని డబ్బాలలో పోసి ఫ్రిడ్‌‌జలో నిల్వ ఉంచాలి. ఈ విధంగా చేయుట వలన ఫంగస్‌ను నివారించవచ్చు.

సహజ ఉత్ప్రేరకాలు: 
ఉత్ప్రేరకాలను ఉపయోగించాలి వర్షాకాలంలో కీటకాలు లేదా పురుగులు నుండి కాయధాన్యాలను సేవ్‌ చేసేందుకు,వాటిని నిల్వ చేసే ముందు ఆవ నూనెను రాయాలి. తాజా ఆహార ధాన్యాలను నిల్వ ఉంచే క్రమంలో వాటికీ కొంత ఆముదదాన్ని చల్లాలి. అయితే ఆముదం ఎక్కువగా కాకుండా ఒక నిర్దిష్ట మొత్తంలో తీసుకోని చూడటానికి ప్రకాశవంతముగా ఉండేలాగా మాత్రమే జాగ్రత్తగా రాయాలి. నట్‌‌స తేమ కారణంగా మెత్తగా మారతాయి. వాటిని మెక్రోవేవ్‌లో వేడి చేస్తే,అవి కొన్ని నిమిషాల తర్వాత క్రిస్పి గా మారతాయి. 

బాక్టీరియాకు దూరంగా: 
వండిన ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలి వండిన ఆహారంలో బాక్టీరియా చేరకుండా ఉండటానికి,రెండు గంటలకు ఒకసారి మూత తీసి వండిన ఆహారంను కలుపుతూ ఉండాలి. చపాతీలు నాచు పట్టకుండా ఉండటానికి వార్తాపత్రికలు లేదా సిల్వర్‌ ఫాయిల్‌ పేపర్‌తో చుట్టాలి. ఈ సీజన్‌లో ఆహారం చెడిపోతుంది. కాబట్టి ఆహారం నిల్వ ఉంచినప్పుడు తప్పనిసరిగా కవర్‌ చేయాలి. అప్పడాలు వేగించిన తర్వాత,ఎక్కువసేపు క్రిస్పిగా ఉండాలంటే వాటిని ఒక జిప్‌ లాక్‌ ప్యాకెట్లలో నిల్వ చేయాలి. ఎల్లప్పుడూ మీ ఆహారాలను వండటానికి ముందు,తర్వాత కవర్‌ చేయాలి. లేకపోతే మీ ఆహారానికి మరియు ఆరోగ్యానికి ఒక పెద్ద ముప్పు ఉంటుంది. వాష్‌ మరియు డ్రై కూరగాయలు మరియు పండ్లను శుభ్రంగా కడగాలి. వీటిని ఉపయోగించడానికి ముందు మరియు ఫ్రిడ్‌‌జలో పెట్టటానికి ముందు బాగా ఆరనివ్వాలి.

ఫ్రిజ్‌ ఉంది కదా అని: 
కొంత మంది ఇళ్లలో ఫ్రిజ్‌ ఉందికదా అని పట్టకుండా నింపేస్తుంటారు. అలా చేసినప్పుడు కొద్ది రోజులకే పాడవుతుంటాయి. మరికొన్ని పండినట్లు అనిపిస్తుంటాయి. ఎందుకలా జరిగిందో అర్ధంకాక సతమతమవుతుంటారు. అలాంటి వారు చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే ఫ్రిజ్‌లో పళ్ళు, కూరగాయలు నిల్వ చేసుకొనేటప్పుడు కూడా తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

ధరల మోత:
అసలే కూరగాయలు, పళ్ళు మొదలైన వాటి ధరాలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో వాటిని జాగ్రత్తగా నిల్వచేయాలి. ఇలా చేయడం వల్ల కేవలం డబ్బు ఆదా అవ్వడం మాత్రమే కాదు, వాటిలోని పోషక విలువలు కూడా అలాగే నిలిచి ఉంటాయి. అందుకే ఈ క్రింది అంశాలు గుర్తుంచుకోవాలి. ఫ్రిజ్‌ లో స్థలం సరిపోవడం లేదా..? అందుకు సులభ చిట్కాలు

1. మార్కెట్‌ నుంచి కూరగాయలు, పళ్ళు...తెచ్చిన వెంటనే అన్నీ కలిపి ఫ్రిజ్‌ లో ఒకే చోట భద్రపరచకూడదు. వేటికవి విడదీసి, విడివిడిగా, రంధల్రున్న కవర్‌‌స లో పెట్టుకోవాలి. దీని వల్ల గాలి సర్కు్యలేట్‌ అవుతుంది. ఫలితంగా అవి ఎక్కువ సమయం తాజాగా కూడా ఉంటాయి. 
2. బంగాళదుంప, ఉల్లిపాయలు, టమోటో, వెల్లుల్లి, అరటిపళ్ళు మొదలైనవి ఫ్రిజ్‌ లో పెట్టకూడదు. 
3. అలాగే బంగాళదుంపలు, మష్రూమ్‌‌స...మొదలైనటువంటి వాటిని ఉపయోగించే ముందు వరకు కడగకూడదు. అప్పుడే అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. 
4. ఉల్లి వెల్లుల్లి, మొదలైనవి ఫ్రిజ్‌ లో కన్నా బయటే గాలి, వెలుతురు ధారళంగా వచ్చే ప్రాంతంలో ఉంచితేనే ఎక్కువ కాలం తాజగా ఉంటాయి. 
5. ఆకు కూరలు తెచ్చిన వెంటనే వాటికున్న బ్యాండ్లు, తాళ్ళు తీసేయాలి. తర్వాత చల్లని నీటితో వాటిని కడిగి పాడైపోయినవి, కుళ్లిన కాడలేమైనా ఉంటే తీసేయాలి. వేటికవి విడదీసి విడివిడిగా కవర్లలో పెట్టి భద్రపరచుకోవాలి. 
6. ఫ్రిజ్‌ లో భద్రపరిచే ఆకుకూరలు కాస్త వాడిపోయినట్లుగా కనిపిస్తాయి. అలా కాకుండా ఉండాలంటే, ఆకుకూరల కాడలను ట్రిమ్‌ చేసుకోవాలి. అలాగే కట్‌ చేసిన చివర్లను ఒక చిన్న పాత్రలో నీటిలో ఉంచుతూ పై భాగాన్ని కవర్‌ తో కప్పి ఉంచాలి. అంటే ఫ్లవర్‌ వాజ్‌ లా అన్న మాట. ఇలా చేయడం వల్ల అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

వాసన రాకుండా: 
టమోటోల విషయానికొస్తే అవి బటయ ఉన్నా కూడా గది ఉష్ణోగ్రత వద్ద బాగానే నిల్వఉంటాయి. వాసన, రుచి సహజంగా నిలిచి ఉంటాయి. ఫ్రిజ్‌ లో ఉన్న టమోటాలైతే కాస్త రుచి తగ్గుతాయనే చెప్పవచ్చు.


మునగాకు పప్పు కూర

మునగాకు పప్పు కూర

మునగాకు పప్పు కూర :

కావలసినవి

మునగాకు : నాలుగు  కప్పులు
కొబ్బరి తురుము : ఒక కప్పు 
కండి పప్పు : రెండు కప్పులు
 మినప పప్పు : ఒక స్పూన్
శెనగ పప్పు : ఒక స్పూన్
ఆవాలు : అర స్పూన్
మెంతులు : పావు స్పూన్
ఇంగువ : చిటికెడు 
పచ్చి మిర్చి : నాలుగు 
కరివేపాకు ; రెండు రాబ్బలు
ఉప్పు: రుచికి తగినంత 
ఎండు మిరపకాయలు : నాలుగు
నూనె : నాలుగు స్పూన్లు 


ముందుగా కందిపప్పు వేయించుకొని (మరీ ఎర్రగా కాకుండా ) మరీ మెత్తగా కాకుండా బద్ద బద్దగా    ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరవాత ఒక బాణలిలో కొద్దిగా నూనే వేసుకొని అందులో సెనగపప్పు, మినప పప్పు, ఆవాలు, మెంతులు , మెరపకాయలు, ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. అందులో కరివేపాకు, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా వేగాక పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో కొద్దిగా నూనే వేసుకొని ( రెండు స్పూన్లు) అందులో చిటికెడు పసుపు వేసి, మునగాకు వేసుకొని మగ్గ పెట్టుకోవాలి (పైన నీళ్ళ కంచం పెట్టుకుంటే బాగా మెత్తబడుతుంది ఆకు) . ఆకు బాగా ఉడికాక అందులో ఉడికించిన కందిపప్పు, పోపు వేసుకొని తగినంత ఉప్పువేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. చివరిగా అందులో కొబ్బరి తురుము వేసి ముతపెట్టుకొని ఒక నిముషము తరవాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 

ఈ కూరలోకి మాగయి  పెరుగు పచ్చడి, చల్ల మెరపకాయలు నంచుకొని తింటే బాగుంటుంది.


గుత్తి వంకాయ కూర



గుత్తి వంకాయ కూర





కావల్సినవి:

వంకాయలు చిన్నవి - అర కిలో
శనగ పప్పు - ఒక కప్
ధనియాలు - ఒక టేబుల్ స్పూన్
ఎండుకొబ్బరి తురిమినది - అర కప్
ఎండు మిర్చి - తగినంత
ఆవాలు, జీలకర్ర పోపుకు సరిపోయే అన్ని
పసుపు
ఉప్పు తగినంత
నూనె _ అర కప్పు 


ముందుగా శనగ పప్పు, ధనియాలు, మిరపకాయలు (నూనె లేకుండా) వేయించి మిక్సీ పట్టుకోవాలి.
తరువాత వంకాయలు కడిగి నిలువుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ముందుగ సిద్ధం చేసుకున్న పొడిని, కొబ్బరి తురుమును కలిపి వంకాయలలో కూర్చాలి.
తరువాత బాణలిలో నూనె పోసి కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, వేసుకొని కొంచం వేగిన తర్వాత కూర్చిన వంకాయలు కూడా వేసి మూత పెట్టాలి. అంతే ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ.



జిలేబి



జిలేబి

మైదా - 1 కప్ 
బియ్యప్పిండి - 3 స్పూన్స్ 
చెక్కర (బెల్లం కోరుకొన్నది) - 21/2 కప్ 
సోడ - చిటికెడు 
కేసర్ రంగు---చిటికెడు 
పుల్ల మజ్జిగ--1 కప్ 
నెయ్యి---2 కప్స్(వేయించడానికి) 


ఒక గిన్నెలోమైదా, బియ్యప్పిండి, సోడ, 
పెరుగు వేసి కొద్దిగా నీరు వేసి పిండిని ఉంటలు లేకుండా జారుగా కలుపుకోవాలి. 
ఇలా కలిపిన పిండిని కనీసం 20 నుంచి 24 గంటల వరకు నాననివ్వాలి.(పక్కరోజు జిలేబి చేయాలంటే ముందు రోజే పిండి తయారు చేసుకోవాలి) 

తరువాత నానిన పిండి లో, కేసర్ కలర్ వేసి బాగా కలపాలి. మైదా పిండి బాగా నాని, తీగ లా జారుగా తయారవుతుంది. తరువాత తయారు చేసుకున్న పిండిని కవ్వం తో చిలకాలి. అప్పుడు పిండీ నురగలుగా వస్తుంది. 


తరువాత ఒక గిన్నెలో చెక్కర (బెల్లం) వేసి, చెక్కర మునిగేలా నీరు వేసి, తీగ పాకం చేసుకోని పక్కన పెట్టుకోవాలి. 
తరువాత వెడల్పాటి బానలి లో నెయ్యి వేసి, వేడి చేయాలి. తరువాత సాస్ బాటిల్లో తయారు చేసిన మైదా పిండిని వేయాలి.తరువాత నెయ్యి కొద్దిగా వేడి అయ్యాక చిన్నగా చుట్లు తిప్పుతూ జిలేబి వేసుకోవాలి. 

ఇలా వేసిన జిలేబిలు గోధుమ రంగు వచ్చేలా రెండు వైపులా కాల్చాలి. 
ఇలా కాల్చిన జిలేబిలను పక్కన పెట్టుకున్న తీగ పాకం లో వేసి అర నిముషం పాటు ఉంచాలి. 
తరువాత తీసి,ప్లేట్ లో తీసుకొని కాసేపు అయ్యాక తింటే పాకం అంతా జిలేబికు పట్టి, ఎంతో రుచిగా ఉంటుంది.





రవ్వ ఇడ్లి



రవ్వ ఇడ్లి


కావాల్సినవి : 


ఉప్మా రవ్వ - 1 కప్పు
పుల్ల పెరుగు - 1 కప్పు
ఉప్పు : తగినంత
నీళ్ళు : తగినంత
కొబ్బరి కోరు - రెండు స్పూన్లు
కారట్ - 1 స్పూన్
ఉల్లిపాయలు - 1 /2 కప్పు సన్నగా తరిగినవి
అల్లం - 1 స్పూన్ సన్నగా తరిగినవి
ఆవాలు, పచ్చి శెనగపప్పు : ఒక అర స్పూన్
నూనె : నాలుగు స్పూన్లు


తయారు చేసే విధానము :

ముందుగా బాండలిలో కొంచం నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. అందులో ఆవాలు, పచ్చి శెనగపప్పు వేసి వేయించాలి.వేగాక ఉప్మా రవ్వ కూడా వేసి వేయించాలి.వేగిన ఉప్మా రవ్వను ఒక గిన్నెలోకి తీసుకొని అందులో పుల్ల పెరుగు, ఉప్పు, తగినంత నీళ్ళు పోసి కలపాలి.మామూలుగా తయారు చేసే ఇడ్లి పిండి లాగ తయారు చేసుకోవాలి.అందులో కారట్ తురుము, ఉల్లిపాయలు,కొబ్బరి కోరు, అల్లం వేసి కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని అర గంట పాటు నాన పెట్టాలి.

ఇడ్లి పాత్రకి నూనె రాసి, వీటిని ఇడ్లి పాతర్లో పెట్టి మామూలు ఇడ్లి చేసే విధానములోనే ఉడికించాలి.
అంతే ఎంతో రుచి గా ఉండే రవ్వ ఇడ్లి రెడీ. దీనిని వేరుశెనగ పచ్చడి / టమాటా పచ్చడితో కాని తింటే బావుంటుంది.


క్యారెట్ హల్వా



క్యారెట్ హల్వా


తోట కూర పులుసు (Thota Koora Pulusu)





తోట కూర పులుసు (Thota Koora Pulusu)

దద్యోధనం (Daddyodhanam)



దద్యోధనం (Daddyodhanam)



రసవాంగి కూటు (Rasavangi Kootu)



రసవాంగి కూటు (Rasavangi Kootu)

ముల్లంగి కూటు (Mullangi Kootu)




 ముల్లంగి కూటు (Mullangi Kootu)



రవ్వ గులాబ్ జామూన్ (RAVVA GULAB JAMOON)



రవ్వ గులాబ్ జామూన్  (RAVVA GULAB JAMOON)

పాప్ కార్న్ లడ్డు ( POP CORN LADDU)



పాప్ కార్న్ లడ్డు ( POP CORN LADDU)

క్రిం డిజార్డ్ (CREAM DEZARD)



క్రిం డిజార్డ్ (CREAM DEZARD)

డ్రై ఫ్రూట్స్ ఖాజా



డ్రై ఫ్రూట్స్ ఖాజా  

పుట్టాల ఫైటర్స్



పుట్టాల ఫైటర్స్ 

ఎగ్ కర్రీ




గ్రుడ్లు - 3 

ఉల్లిపాయలు - 1 తరిగినది 


టమోటాలు - 1 తరిగినది 


కారం


పసుపు - 1 teaspoon 

మిరియాల పొడి 


ఉప్పు



ఒక పాన్ తీసుకొని తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి 


కాగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి


వేగాక టమోటా ముక్కలను, పసుపు, ఉప్పు, కరం వేసి బాగా కలిపి 5 నిముషాల 

పాటు fry చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్రుడ్డు తీసుకొని పగలకొట్టి గ్రుడ్డు మొత్తం 

ఒకే చోటు పడేటట్టు వేసుకోవాలి . అలాగే మిగిలిన గ్రుడ్లను కూడా పాన్ అన్ని 

వైపులా వేసుకోవాలి కొంచం ఉప్పు, మిరియాల పొడి గ్రుడ్డు పైన చల్లి మూత పెట్టి 

ఉడక పెట్టుకోవాలి ఒక వైపు ఉడికాక గ్రుడ్లను ఇంకో వైపు తిప్పి ఉడికించాలి 

అంతే అన్నం తో వేడి వేడి గ తింటే ఎంతో రుచి గా ఉంటుంది  ఎగ్ కర్రీ







అరటి పొడి




అరటి పొడి


స్టఫ్డ్ అరటికాయ




స్టఫ్డ్ అరటికాయ




అరటి కాయ మసాల వడ




అరటి కాయ మసాల వడ




అరటి కోఫ్తా మసాలా కర్రీ

అరటి కోఫ్తా మసాలా కర్రీ




అరటికాయ మిక్స్ వెజ్ కర్రి



అరటికాయ మిక్స్ వెజ్ కర్రి 



దోసకాయ బర్ఫీ




దోసకాయ బర్ఫీ






బియ్యపు రొట్టె (కొయ్య రొట్టె)



బియ్యపు రొట్టె (కొయ్య రొట్టె)

























తోటకూర గింజల యోగర్ట్

తోటకూర గింజల యోగర్ట్ 





రోటి చలిమిడి





రోటి చలిమిడి





ఫ్రూట్ రైతా







ఫ్రూట్ రైతా